ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2020-02-20T05:48:09+05:30 IST

శంషాబాద్‌ అంతరాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న ఓ ప్రయాణికురాలు బుధవారం 233 గ్రాముల బంగారంతో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే...

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతరాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వస్తున్న ఓ ప్రయాణికురాలు బుధవారం 233 గ్రాముల బంగారంతో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే... విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై కస్టమ్స్‌ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో ఆమెను ఆపి తనిఖీ చేయగా లోదుస్తుల్లో బంగారం లభించింది. ఆమె మెడలో ఆభరణాల రూపంలో కూడా బంగారం లభించింది. దొరికిన బంగారాన్ని తూకం వేయగా 233.2 గ్రాముల బరువు ఉంది. బంగారం విలువ దాదాపు రూ.14 లక్షలు ఉంటుందని అంచనావేస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ ప్రయాణికుడు బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకొని తరలించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుబడ్డాడు.  ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారుల కథనం ప్రకారం..  ఓ ప్రయాణికుడు బంగారాన్ని గ్రాండర్‌లో వాడే పొడి మాదిరిగా చేసి ఆ బంగారాన్ని లో దుస్తుల్లో పెట్టుకొని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండా పట్టుబడ్డాడు. బంగారం విలువ దాదాపు రూ. 6 లక్షలు ఉంటుందని అంచనా ఈ మేరకు కస్టమ్స్‌ అధికారులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-20T05:48:09+05:30 IST