9 మంది భార్యలను సంతృప్తి పరచలేక భర్త పాట్లు! ఎవరితో ఎప్పుడు గడపాలో తెలిపే టైం టేబుల్ సిద్ధం చేస్తే.. చివరకు అనూహ్యంగా..

ABN , First Publish Date - 2022-04-29T01:24:44+05:30 IST

: ఒక్కరితో సాఫీగా సంసారం చేయడమే కష్టంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఏకంగా తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో అంతా సాఫీగా సాగిపోయినా క్రమంగా సంసారంలో కలతలు రేగాయి.

9 మంది భార్యలను సంతృప్తి పరచలేక భర్త పాట్లు! ఎవరితో ఎప్పుడు గడపాలో తెలిపే టైం టేబుల్ సిద్ధం చేస్తే.. చివరకు అనూహ్యంగా..

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కరితో సాఫీగా సంసారం చేయడమే కష్టంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి ఏకంగా తొమ్మిది మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో అంతా సాఫీగా సాగిపోయినా క్రమంగా సంసారంలో కలతలు రేగాయి. భర్త సాంగత్యం కోసం అందరూ తపించారు. దీనికి పరిష్కారంగా ఒక్కో సమయంలో ఒక్కొక్కరితో ఏకాంతంగా గడిపేలా ఓ టైం టేబుల్ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ.. ఇప్పుడు ఈ పరిష్కారమూ బెడిసికొట్టింది. ఆ తొమ్మిది మంది భార్యల్లో ఒకరు అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళితే.. 


బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ అర్సో.. మోడల్‌గా అక్కడి ప్రజలకు సుపరిచితుడు. అంతేకాకుండా.. అతడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా..! విశ్వజనీనమైన ప్రేమకు ఎటువంటి కృత్రిమమైన పరిమితులు ఉండకూడదని ఆర్థర్ బలంగా విశ్వసిస్తాడు. అందుకే అతడు ఏకంగా తొమ్మిది మందిని వివాహం చేసుకున్నాడు. ఇక వారంలో ఉండేది ఏడు రోజులే అయితే.. అతడి జీవితంలో మాత్రం ఏకంగా తొమ్మిది మంది మహిళలు. ఇదే అతడి సంసారంలో ఒడిదుడుకులకు దారితీసింది. దాంపత్య జీవితం పట్ల భార్యల్లో అసంతృప్తి బయలు దేరింది. 


దీంతో భార్యలందరినీ సమానంగా సంతృప్తి పరిచేందుకు ఓ పరిష్కారం సిద్ధం చేసుకున్నాడు. ఒక్కొక్కరికీ తగినంత టైం ఇచ్చేలా ఓ టైం టేబుల్ రెడీ చేశాడు. కానీ.. ఇది ఆర్థర్‌లో అసంతృప్తికి దారి తీసింది. ‘‘టైం టేబుల్ ప్రకారమే నా భార్యల వద్దకు వెళ్లేవాణ్ణి. కానీ.. ఈ పద్ధతితోనూ సమస్యలు మొదలయ్యాయి. కోరిక కలిగినప్పుడు శృంగారంలో పాల్గొనకుండా ఇలా చచ్చినట్టు టైం టేబుల్ ప్రకారం భార్యలతో గడపడంతో నాలో అసంతృప్తి తలెత్తింది. కొన్ని సందర్భాల్లో ఓ భార్యతో ఉంటూ మరో భార్యను ఊహించుకునే వాణ్ణి.’’ అంటూ తన చిక్కుల గురించి చెప్పుకొచ్చాడు ఆర్థర్. చివరకు ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు అంతా సహజంగా జరిగిపోయిందనీ, తాము సంతోషంగా ఉన్నామని అతడు తెలిపాడు. 


కానీ.. మళ్లీ వారి జీవితాల్లో కల్లోలం రేగింది. ‘‘నా ప్రేమ కావాలని అందరూ అడుగుతారు. నాతో గడపాలని ఉందంటారు. కానీ ఒకరి కంటే మరొకరి కోసం ఎక్కువ సమయం ఇవ్వలేను కదా’’ అని ఆర్థర్ తన పరిస్థితి గురించి వివరించాడు. వారి వైవాహిక జీవితంలో ఇలా సాగుతుండగా ఓ భార్య అతడిని ఇటీవలే విడిచిపెట్టి వెళ్లిపోయింది. ‘‘నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలంటూ ఆమె డిమాండ్ చేసింది. ఇది చాలా అర్థరహితం. మిగతా వారు కూడా నన్ను కోరుకుంటారు. వారితో నన్ను పంచుకునేందుకు ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి’’ అంటూ అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన పట్ల కొన్ని రోజులు పాటు వారందరూ సుదీర్ఘంగా చర్చించారు. చివరకు ఆమెకు ఆర్థర్‌పై ప్రేమ లేదనే నిర్ధారణకు వచ్చారు. 


‘‘ఆమెకు నామీద అస్సలు ప్రేమే లేదు. ఇదో కొత్త అనుభవం అవుతుందని ఆశించి నాతో పెళ్లికి ఒప్పుకుంది.’’ అని ఆర్థర్ తేల్చాడు. వాస్తవానికి ఆర్థర్ పది మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎనిమిది మందితోనే సర్దుకుపోతున్నాడు. వాళ్ల ప్రేమలో నిండామునిగిపోయిన అతడు..టార్గెట్ పూర్తి చేసేందుకు తొందరేంలేదని తాపీగా చెప్పుకొచ్చాడు. ‘‘మా బంధం గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది’’ అంటూ ముక్తాయించాడు.

Updated Date - 2022-04-29T01:24:44+05:30 IST