పెట్రోపోలిస్ (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో సంభవించిన మెరుపు వరదల్లో 78 మంది దుర్మరణం చెందారు.భారీవర్షాల వల్ల బ్రెజిల్ దేశంలోని పెట్రోపోలిస్ నగరంలోని వీధులు నదులుగా మారాయి. వరదనీటి ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావం వల్ల రియో డి జనీరోకు ఉత్తరాన ఉన్న హిల్స్ లోని సుందరమైన పట్టణంపై వరదనీరు వెల్లువెత్తింది. వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి వారికి ఆహారం, నీరు, దుస్తులు, ఫేస్ మాస్కులు ఇచ్చారు.భారీ వరదల్లో నగరంలోని కార్లు, చెట్లు కొట్టుకుపోయాయి.
బ్రెజిల్ లోని పెట్రోపోలిస్ నగరంలో కేవలం మూడు గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మేయర్ కార్యాలయం తెలిపింది.డిసెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది.గత నెలలో కుండపోత వర్షం, వరదల వల్ల కొండచరియలు విరిగిపడటంతో ఆగ్నేయ బ్రెజిల్‌లో 28 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి