western Ghanaలో మైనింగ్ ట్రక్కు పేలుడు...17 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-21T13:16:58+05:30 IST

పశ్చిమ ఘనా దేశంలో ఘోర పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న మైనింగ్ ట్రక్ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది...

western Ghanaలో మైనింగ్ ట్రక్కు పేలుడు...17 మంది మృతి

మరో 59 మందికి గాయాలు...ఆసుపత్రులకు తరలింపు 

పశ్చిమ ఘనా దేశంలో ఘోర పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న మైనింగ్ ట్రక్ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి ఘనాలోని చిన్న పట్టణం అపియాట్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.పేలుడు పదార్థాలున్న ట్రక్కు నైరుతి ఘనాలోని అపియాట్ పట్టణం మీదుగా చిరానో బంగారు గనుల వద్దకు వెళుతుండగా మోటారుసైకిలు ఢీకొంది. దీంతో పేలుడు పదార్థాలున్న ట్రక్కులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు సైతం నేలకూలాయి.క్షతగాత్రులను బొగోసో పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి పలు ఇళ్ల మెటల్ పైకప్పులు ఎగిరి పడ్డాయి. పేలుడు వల్ల గాయపడిన ప్రజలు సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడిపోయారు.


ఈ పేలుడు ఘటనలో 17 మంది మరణించగా, మరో 59 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ సమన్వయకర్త అబ్దుల్ గనియు మహమ్మద్ చెప్పారు. మైనింగ్ పేలుడు కోసం ట్రక్కులో డైనమైట్ తీసుకువెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని మహమ్మద్ చెప్పారు. మృతుల్లో ట్రక్కు డ్రైవరు లేడని అధికారులు చెప్పారు.సంఘటన స్థలంలో కొందరు శిథిలాల కింద కూరుకుపోయారు. దీంతో అత్యవసర సహాయ సిబ్బంది సంఘటన స్థలాన్ని మూసివేసి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - 2022-01-21T13:16:58+05:30 IST