నేటినుంచి పద్మావతి నిలయంలో కోవిడ్‌ బాధితులకు సేవలు

ABN , First Publish Date - 2021-04-08T07:05:32+05:30 IST

కరోనా కేసులు ్పెరుగుతుండడంతో బాధితుల కోసం తిరుచానూరులోని పద్మావతి నిలయంలో జిల్లా కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు

నేటినుంచి పద్మావతి నిలయంలో కోవిడ్‌ బాధితులకు సేవలు

తిరుచానూరు, ఏప్రిల్‌ 7: కరోనా కేసులు ్పెరుగుతుండడంతో బాధితుల కోసం తిరుచానూరులోని పద్మావతి నిలయంలో జిల్లా కొవిడ్‌కేర్‌ సెంటర్‌  ఏర్పాటు చేశారు.కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెయ్యి పడకలను ఇక్కడ సిద్ధం చేసినట్లు పద్మావతి నిలయం ప్రత్యేకాధికారి,తుడా కార్యదర్శి లక్ష్మి తెలిపారు. పేషెంట్‌ వచ్చేటప్పుడు ఒక ప్లేట్‌, స్టీల్‌గ్లాసును మాత్రం తెచ్చుకోవలసి వుంటుందని తెలిపారు. గురువారం నుంచి కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించడానికి పద్మావతి నిలయం సిద్ధమైందన్నారు. ఇప్పటిదాకా ఇక్కడున్న పర్యాటకశాఖ  తమ సిబ్బందిని,సామగ్రిని బుధవారం మరో ప్రాంతానికి తరలించింది.

Updated Date - 2021-04-08T07:05:32+05:30 IST