ఆన్‌‘లైన్‌’లోనే..!

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైనది. కానీ ఆ శాఖలోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సాంకేతిక చిక్కులు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోతుండడంతో ఆస్తుల క్రయ విక్రయదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండి పడుతోంది. కరోనా మొదటి వేవ్‌లో నెలల తరబడి కార్యాలయాలు మూతపడ్డాయి. సెకెండ్‌ వేవ్‌లో కూడా అదే పరిస్థితి. ఆ సమయంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించలేదు. ప్రస్తుతం తెలంగాణ నుంచి డేటా బేస్‌ అమరావతికి మార్చే పనిలో పడ్డారు. ఫలితంగా కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. తొలుత ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకూ నాలుగు రోజుల పాటు పూర్తిగా కార్యాలయాల్లో సేవలను నిలిపివేశారు. 13 నుంచి యధావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆ శాఖ ప్రకటించింది. పది రోజులు దాటుతున్నా పూర్తిస్థాయిలో సర్వర్‌ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఫలితంగా వినియోగదారులకు ఇప్పందులు తప్పడం లేదు. జిల్లాలో బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, పార్వతీపురం, సాలూరు, ఎస్‌.కోట, తెర్లాం, విజ

ఆన్‌‘లైన్‌’లోనే..!
కొత్తవలస సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం




రిజిస్ట్రేషన్లకు సర్వర్‌ సమస్య

 డేటా బేస్‌ మార్పిడే కారణం

క్రయవిక్రయదారులకు ఇక్కట్లు 

(కొత్తవలస)

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైనది. కానీ ఆ శాఖలోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సాంకేతిక చిక్కులు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోతుండడంతో ఆస్తుల క్రయ విక్రయదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండి పడుతోంది.  కరోనా మొదటి వేవ్‌లో నెలల తరబడి కార్యాలయాలు మూతపడ్డాయి. సెకెండ్‌ వేవ్‌లో కూడా అదే పరిస్థితి. ఆ సమయంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించలేదు. ప్రస్తుతం తెలంగాణ నుంచి డేటా బేస్‌ అమరావతికి మార్చే పనిలో పడ్డారు. ఫలితంగా కార్యాలయాల్లో సర్వర్‌ సమస్య తలెత్తుతోంది. తొలుత ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకూ నాలుగు రోజుల పాటు పూర్తిగా కార్యాలయాల్లో సేవలను నిలిపివేశారు. 13 నుంచి యధావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆ శాఖ ప్రకటించింది. పది రోజులు దాటుతున్నా పూర్తిస్థాయిలో సర్వర్‌ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఫలితంగా వినియోగదారులకు ఇప్పందులు తప్పడం లేదు. జిల్లాలో బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, పార్వతీపురం, సాలూరు, ఎస్‌.కోట, తెర్లాం, విజయనగరం ఆర్‌., విజయనగరం వెస్ట్‌ తదితర 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సాధారణంగా రోజుకు 400 రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రభుత్వానికి రోజుకు లక్షలాది రూపాయల ఆదాయం సమకూరేది. కానీ గత కొద్దిరోజులుగా సాంకేతిక సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. సర్వర్‌ సమస్యతో వివరాలు సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. ఈకేవైసీ, ఫొటోలు అప్‌లోడ్‌ కావడం లేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  క్రయ విక్రయదారులు నిత్యం కార్యాలయానికి రావడం, పడిగాపులు కాయడం, నిరాశతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి ఆదాయం విషయంలో సింహభాగం రిజిస్ట్రేషన్‌ శాఖదే. అటువంటి శాఖపైనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని వినియోగదారులు కోరుతున్నారు. సాంకేతిక సమస్యలపై కొత్తవలస సబ్‌ రిజిస్ట్రార్‌ పైడిరాజు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా...డేటా బేస్‌ మార్పిడి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందుకే సర్వర్‌ సమస్య తలెత్తిందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరిగి యథావిధిగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు.  



Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST