విద్యారంగంలో తీవ్ర సంక్షోభం : యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-07-06T05:56:57+05:30 IST

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టుల భర్తీ కాక విద్యారంగంలో తీవ్రసంక్షోభం నెలకొందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు.

విద్యారంగంలో తీవ్ర సంక్షోభం : యూటీఎఫ్‌
కోదాడ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

కోదాడ టౌన్‌ / అర్వపల్లి / మఠంపల్లి,  జూలై 5 : రాష్ట్రంలో ఉపాధ్యాయులకు నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టుల భర్తీ కాక విద్యారంగంలో తీవ్రసంక్షోభం నెలకొందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మహాసభ కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించి, మాట్లాడారు. 317 జీవో అమలుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ బిక్షం, రాష్ట్ర కౌన్సిలర్‌ ఆర్‌ రామనర్సయ్య, యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివా్‌సరెడ్డి, టీపీటీఎఫ్‌ కోదాడ మండల అధ్యక్షుడు బడుగుల సైదులు, మాతంగి శ్రీనివాస్‌, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అర్వపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మహాధర్నా పోస్టర్‌ను టీపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పగిళ్ళ సైదులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ నాయకులు వీరస్వామి, అబ్బెటి యాదగిరి, ప్రసాద్‌, సుధాకర్‌, బాలాజీ, వెంకటేశ్వర్లు, మధుసూథన్‌రావు, శ్రీరాములు, మధుకర్‌, మల్లారెడ్డి, నర్సయ్య, గోపాల్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు. మఠంపల్లి మండలం రఘునాథపాలంలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.దామోదర్‌ మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై యూనియన్‌ నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీమన్నారాయణ, కోదండరామయ్య, నాగేశ్వరావు, ప్రదీప్‌, గోవింద్‌, రమేష్‌, అరుణ, జోసన్న, జ్యోతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:56:57+05:30 IST