సియోల్ నగర మేయర్ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-07-10T12:09:28+05:30 IST

దక్షిణ కొరియాలోని సియోల్ నగర మేయరు పార్క్ వన్ సూన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు....

సియోల్ నగర మేయర్ అనుమానాస్పద మృతి

సియోల్ (దక్షిణ కొరియా): దక్షిణ కొరియాలోని సియోల్ నగర మేయరు పార్క్ వన్ సూన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. చాలాకాలంపాటు సియోల్ నగర మేయరుగా పనిచేసిన పార్క్ తప్పిపోయినట్లు అతని కుమార్తె చెప్పిన కొద్ది గంటల్లోనే అతని మృతదేహం ఉత్తర సియోల్ లోని మౌంట్ బుగాక్ వద్ద కనుగొన్నారు. మేయర్ పార్క్ మృతదేహం సమీపంలో అతని ఫోన్ సిగ్నల్ చివరిగా కనుగొన్నామని సియోల్ మెట్రోపాలిటన్ పోలీసు ఏజెన్సీ వెల్లడించింది. మేయర్ పార్క్ కుమార్తె గురువారం సాయంత్రం 5.17 గంటలకు తన తండ్రి తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో మేయరు పార్క్ కోసం వందలాదిమంది పోలీసులు ఆయన కోసం గాలించారు. మేయర్ పార్క్ మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తామని సియోల్ నగర పోలీసులు చెప్పారు. 10మిలియన్ల జనాభా ఉన్న సియోల్ నగరానికి పార్క్ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర పోషించారు. 2022లో జరగనున్న కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాదులకు అశాజనక అధ్యక్షుడిగా పార్క్ కనిపించారు. పార్క్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని మాజీ కార్యదర్శి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  

Updated Date - 2020-07-10T12:09:28+05:30 IST