ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

ABN , First Publish Date - 2021-03-02T05:12:17+05:30 IST

కడప కలెక్టరేట్‌లోని జిల్లా ఆడిట్‌ అధికారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న అబ్దుల్‌ జబ్బార్‌ సోమవారం డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్‌కు సంబంధించి

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌
ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్దుల్‌ జబ్బార్‌

పెన్షన మంజూరుకు రూ.5 వేలు లంచం డిమాండ్‌

కడప(క్రైం), మార్చి 1: కడప కలెక్టరేట్‌లోని జిల్లా ఆడిట్‌ అధికారి కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న అబ్దుల్‌ జబ్బార్‌ సోమవారం డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్‌కు సంబంధించి ఫైలును ఖజానా అధికారులకు పంపేందుకు ఆ రిటైర్డ్‌ ఉద్యోగిని లంచం ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ పి.కంజక్షన ఆధ్వర్యంలో నిఘా ఉంచి ఆ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. మైదుకూరు మండలం తువ్వపల్లె గ్రామానికి చెందిన కూరాకు పెద్దవెంకటయ్య కడప ఇరిగేషన కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లోని జిల్లా ఆడిట్‌ కార్యాలయానికి బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలు అందజేశారు. అయితే ఎంతకూ ఆ ఫైలు మూవ్‌ కాకపోవడంతో సీనియర్‌ అసిస్టెంట్‌ అబ్దుల్‌జబ్బార్‌ను కలవడంతో రూ.5 వేలు లంచం ఇస్తే ఫైలును ఖజానా శాఖకు పంపిస్తానని డిమాండ్‌ చేయడంతో వెంకటయ్య ఏసీబీని ఆశ్రయించారన్నారు. ఇనస్పెక్టర్లు రామాంజనేయులు, రెడ్డెప్ప, శ్రీనివాసులరెడ్డి సిబ్బందితో నిఘా ఉంచి ఆయనను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీనియర్‌ అసిస్టెంట్‌ను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-02T05:12:17+05:30 IST