మానవాళికి విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అవసరం

ABN , First Publish Date - 2022-08-09T06:11:12+05:30 IST

నేటి మానవాళికి అణుయుద్ధాలు అవసరం లేదని విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అవసరం అని రాఘవాచారి ట్రస్ట్‌ ప్రతినిధి, ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ నాయకులు అక్కినేని చంద్రారావు అన్నారు.

మానవాళికి విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అవసరం
అణుయుద్ధ సంఘటనల బ్యానర్‌ను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు, అక్కినేని చంద్రారావు, కళాశాల అధ్యాపకులు

మానవాళికి విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అవసరం

 ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ నాయకుడు అక్కినేని చంద్రారావు 

లబ్బీపేట, అగస్టు 8: నేటి మానవాళికి అణుయుద్ధాలు అవసరం లేదని విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ అవసరం అని రాఘవాచారి ట్రస్ట్‌ ప్రతినిధి, ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ నాయకులు అక్కినేని చంద్రారావు అన్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం కళాశాల రసాయన శాస్త్రం విభాగం, భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం సంయుక్త ఆధ్యర్యంలో అణుదాడి జరిగి 77  ఏళ్లు గడిచిన సందర్భంగా హిరోషిమా నాగసాకి యుద్ధ పరిణామాలు- నేర్చుకోవాల్సిన గుణపాఠాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సైన్స్‌ లోకి రాజకీయ ప్రమేయం, మతపరమైన జోక్యం రావడం బాధాకరం అని, వీటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కళాశాల డైరెక్టర్‌ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ కల్పన మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వలన కలుగుతున్న నష్టాలు మనకు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాటి యుద్ధ ఘటనలతో ఉన్న పోస్టర్‌ను ప్రదర్శించారు. ఇస్కఫ్‌ జిల్లా కార్యదర్శి మోతుకూరి అరుణకుమార్‌, జనవిజ్ఞాన వేదిక నాయకులు శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:11:12+05:30 IST