నగర కమిషనర్ వెంకటేశ్వరరావును ఆశీర్వదిస్తున్న మేయర్ సుజాత
ఒంగోలు (కార్పొరేషన్), మే 20 : నగర కమిషనర్గా ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన సమయంలో వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మేయర్ గంగాడ సుజాత ముందు ‘సదా.. మీ సేవలో’ అన్నట్లు వంగి మరీ నమస్కరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన దండం పెడుతుంటే మేయర్ మత గురువులా తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం చూసి ఔరా.. ఇదేమి విడ్డూరం అంటూ సిబ్బంది చెవులు కొరుక్కున్నారు.