తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి

ABN , First Publish Date - 2021-10-21T06:48:06+05:30 IST

శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపడితే గ్రామీణ యువతకు మంచి స్వయం ఉపాధి లభిస్తుందని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి జి.సంగీతలక్ష్మి అన్నారు.

తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యానవన అధికారి సంగీతలక్ష్మి

గరిడేపల్లి రూరల్‌, అక్టోబరు 20: శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం చేపడితే గ్రామీణ యువతకు మంచి స్వయం ఉపాధి లభిస్తుందని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి జి.సంగీతలక్ష్మి అన్నారు. మండలంలో ని గడ్డిపల్లి కేవీకేలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై బుధవారం నిర్వ హించిన మూడో విడత శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తేనె టీగల పెంపకానికి ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తేనెటీగల పెంపకం ద్వారా పంటలలో పరపరాగ సంపర్కం జరిగి దిగుబడులు పెరుగుతాయన్నారు. అనంతరం యువతకు కేవీకేలోని వివిధ ప్రదర్శన క్షేత్రాల గురించి వివరించారు. ప్రాక్టికల్‌గా వారిని తేనెటీగల పెట్టెల వద్దకు తీసుకె ళ్లి వాటి గురించి వివరంగా తెలియపర్చారు. కార్యక్రమంలో కేవీకే కార్యదర్శి గంటా సత్యనారాయణరెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ బి.లవకుమార్‌, శాస్త్రవేత్తలు సీ.హెచ్‌ నరేష్‌, కిరణ్‌, సుగంధి, జె.అనూష, సత్యనారాయణ, కృష్ణ, సైదులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:48:06+05:30 IST