వడ్డాదిలో 115 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

మండలంలోని వడ్డాది కూడలిలో 115 గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

వడ్డాదిలో 115 కిలోల గంజాయి పట్టివేత

ముగ్గురి అరెస్టు... కారు స్వాధీనం

బుచ్చెయ్యపేట, మే 5:
మండలంలోని వడ్డాది కూడలిలో 115 గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ బి.రామకృష్ణ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అడుగ భాగాన ప్రత్యేకంగా తయారు చేసిన రేఖలో గంజాయి గుర్తించారు. గంజాయి రవాణా చేస్తున్న ముంచంగిపుట్టుకు చెందిన సీసా గజపతి, కె.పరుశురామ్‌, కేరళా రాష్ట్రానికి చెందిన అవిష్‌ అనిషాలను అరెస్టు చేశారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST