61,595 కేజీల మిక్స్‌డ్‌ సాల్వెంట్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-29T04:23:51+05:30 IST

ఎటువంటి అనుమతులు లేకుండా ఆటోనగర్‌ డీ బ్లాక్‌లో నిల్వ ఉంచిన మిక్సిడ్‌ సాల్వెంట్‌ గోడౌన్‌పై గాజవాక పోలీసులు గురువారం దాడి చేశారు. 329 డ్రమ్ములలో ఉన్న సుమారు 61,595 కేజీల వివిధ రకాల కెమికల్స్‌ను స్వాధీనం చేసుకుని, రాజస్థాన్‌ ప్రాంతానికి చెందిన నిర్వాహకుడు భవర్‌లాల్‌ను అరెస్టు చేశారు.

61,595 కేజీల మిక్స్‌డ్‌ సాల్వెంట్‌ స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న మిక్స్‌డ్‌ సాల్వెంట్‌ డ్రమ్ములు

గాజువాక, అక్టోబరు 28: ఎటువంటి అనుమతులు లేకుండా ఆటోనగర్‌ డీ బ్లాక్‌లో నిల్వ ఉంచిన మిక్సిడ్‌ సాల్వెంట్‌ గోడౌన్‌పై గాజవాక పోలీసులు గురువారం దాడి చేశారు. 329 డ్రమ్ములలో ఉన్న సుమారు 61,595 కేజీల వివిధ రకాల కెమికల్స్‌ను స్వాధీనం చేసుకుని, రాజస్థాన్‌ ప్రాంతానికి చెందిన నిర్వాహకుడు భవర్‌లాల్‌ను అరెస్టు చేశారు. పెయింట్స్‌లో వినియోగించే సాల్వెంట్‌లను అనధికారికంగా తయారుచేసినందుకు, ఎటువంటి అనుమతులు లేకుండా టోలిన్‌, మిఽథైల్‌ డై క్లోరైడ్‌, టిన్నర్‌, ఐసీ ఆల్కహాల్‌ తదితర రసాయనాలను నిల్వ ఉంచడం నేరమని, ముందస్తు సమాచారంతో దాడులు చేశామని సీఐ మల్లేశ్వరరావు వివరించారు. 

Updated Date - 2021-10-29T04:23:51+05:30 IST