ఒక్క కొడుకైనా ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు ఏడవటం చూసి పెద్ద కూతురు షాకింగ్ నిర్ణయం.. లింగమార్పిడి చేసుకుంది కానీ..

ABN , First Publish Date - 2022-06-17T20:28:43+05:30 IST

ఆ దంపతులు తమకు కొడుకు కావాలని ఆశపడ్డారు.. ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించారు.. అయితే ఐదుసార్లూ వారికి కుమార్తెలే పుట్టారు..

ఒక్క కొడుకైనా ఉంటే బాగుండేదని తల్లిదండ్రులు ఏడవటం చూసి పెద్ద కూతురు షాకింగ్ నిర్ణయం.. లింగమార్పిడి చేసుకుంది కానీ..

ఆ దంపతులు తమకు కొడుకు కావాలని ఆశపడ్డారు.. ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించారు.. అయితే ఐదుసార్లూ వారికి కుమార్తెలే పుట్టారు.. దీంతో ఇద్దరూ కుంగిపోయారు.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. కొడుకు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసిన పెద్ద కూతురు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. తన తల్లిదండ్రులు విడిపోకూడదనే కారణంతో ఆమె మగాడిగా మారాలని నిర్ణయించుకుంది.. ఐదు నెలల పాటు చికిత్స చేయించుకుని పూర్తి అబ్బాయిగా మారిపోయింది.. పూర్తి స్థాయిలో అబ్బాయిగా మారిపోయినప్పటికీ సంతానం మాత్రం కలిగే వీలు లేదు. 


ఇది కూడా చదవండి..

అందరూ చూస్తుండగానే చెప్పులతో ఓ యువకుడిని చితకబాదిన యువతి.. నడిరోడ్డుపై అతడు చేసిన నిర్వాకానికి..


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నిర్మల (అసలు పేరు కాదు) ఇటీవల సర్దార్ వల్లభాయ్ పటేల్ మెడికల్ హాస్పిటల్‌లో లింగ మార్పిడి చికిత్స చేయించుకుని పూర్తి స్థాయిలో అబ్బాయిగా మారిపోయింది. నాలుగు నెలల పాటు హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకుంది. దీంతో ఆమెకు గడ్డాలు, మీసాలు పెరిగాయి. ఇక, తాజాగా లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. `నా సోదరీమణులలో నేనే పెద్దదాన్ని. ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడం నా కర్తవ్యం. మా కుటుంబం విచ్ఛిన్నం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అమ్మాయి శరీరాన్ని విడిచిపెట్టి అబ్బాయిగా మారవలసి వచ్చింది. నా తల్లిదండ్రులకు ఒక కొడుకుగా, నా సోదరీమణులకు ఒక సోదరుడుగా మారినందుకు సంతోషపడుతున్నాన`ని నిర్మల చెప్పింది. 


`అబ్బాయి కోసం అమ్మ పదే పదే ఏడుస్తూ ఉండడం చూసి నేనే కొడుకుగా మారాలనుకున్నాను. నా తల్లిదండ్రులకు కొడుకు లేని లోటు తీరుస్తాను. నేను ఆపరేషన్ గురించి నా తల్లిదండ్రులకు చెప్పినపుడు మొదట వారు తిరస్కరించారు. చాలా రోజులు నచ్చ చెప్పిన తరువాత అర్థం చేసుకున్నార`ని నిర్మల చెప్పింది. అయితే ఆమె అబ్బాయిగా మారినప్పటికీ, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2022-06-17T20:28:43+05:30 IST