Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 29 2021 @ 10:56AM

Delhi: జైలు నుంచి పారిపోయేందుకు ఖైదీల ప్లాన్

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జైళ్లలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జైళ్లలో ఉన్న ఐదుగురు కరడుకట్టిన ఖైదీలు పారిపోయేందుకు వ్యూహం పన్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది. ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలతో ఢిల్లీ జైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ జితేందర్ మన్ అలియాస్ గోగి గత వారం జరిగిన కాల్పులలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తర్వాత దేశ రాజధానిలో ఎలాంటి గ్యాంగ్ వార్ జరగకుండా జైలు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు కోరారు.గ్యాంగ్‌స్టర్ గోగి సహచరులు సోషల్ మీడియా అకౌంట్లలో బెదిరింపు సందేశాలు పెట్టారు. దీంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.తాము ప్రత్యర్థుల నుంచి ప్రతీకారం తీర్చుకుంటామని గోగి సహచరులు సందేశాలు పెట్టారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement