లతా మంగేష్కర్ అంత్యక్రియలకు భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2022-02-06T20:42:33+05:30 IST

లతా మంగేష్కర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించన్నారు. ఇందుకోసం దాదర్ ..

లతా మంగేష్కర్ అంత్యక్రియలకు భద్రత కట్టుదిట్టం

ముంబై: లతా మంగేష్కర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించన్నారు. ఇందుకోసం దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ ఏరియాలో భద్రతను ముంబై పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 5.45-6.00 గంటల మధ్యలో గ్రౌండ్స్‌కు చేరుకుంటారని, 6.15-6.30 గంటల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరుగుతాయని బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ ఛాహల్ తెలిపారు.


సినీ , రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటున్నందున  వాహనాల రాకపోకలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. పలు ప్రధాన రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్స్‌ను మళ్లిస్తున్నారు. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ తుదిశ్వాస విడవడంతో అభిమానులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. లతా మంగేష్కర్ గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల (6,7 తేదీలు) సంతాప దినాలను ప్రకటించింది. ఈ రెండ్రోజులు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించరు.

Updated Date - 2022-02-06T20:42:33+05:30 IST