భద్రతను ఏర్పాటు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-06T05:58:22+05:30 IST

జిల్లాలోని ఏటీఎంల వద్ద సంబంధిత బ్యాంకు సిబ్బంది భద్రతను నియమించు కోవాలని వనపర్తి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

భద్రతను ఏర్పాటు చేసుకోవాలి
చోరీకి గురైన ఏటీఎంను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి ఎస్పీ

- వనపర్తి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ  రంజన్‌ రతన్‌కుమార్‌ 

చోరీకి గురైన ఏటీఎం పరిశీలన


వనపర్తి క్రైమ్‌, ఆగస్టు 5: జిల్లాలోని ఏటీఎంల వద్ద సంబంధిత బ్యాంకు సిబ్బంది భద్రతను నియమించు కోవాలని వనపర్తి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కర్నూల్‌ రోడ్డులో చోరీకి గురైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను ఆయన పరిశీలిం చారు. దుండగులు పగులకొట్టిన ఏటీ ఎంతో పాటు, సీసీ కెమెరాలను పరిశీ లించారు. ప్రొఫెషనల్‌ దొంగలే ఈ చోరీకి పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చి నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుంటామని, సాంకే తిక పరిజ్ఞానంతో నిందితులను త్వర లోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. రాత్రివేళలో పెట్రోలింగ్‌ పెంచుతామని తెలిపారు. ఇన్‌చార్జి ఎస్పీ వెంట డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌ కుమార్‌, పట్టణ ఎస్సై యుగంధర్‌రెడ్డి ఉన్నారు.    


Updated Date - 2022-08-06T05:58:22+05:30 IST