11 జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు

ABN , First Publish Date - 2020-09-20T23:48:03+05:30 IST

పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాజస్థాన్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తూ ముఖ్యమంత్రి..

11 జిల్లాల్లో 144 సెక్షన్ విధింపు

జైపూర్: పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రాజస్థాన్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది.


జైపూర్, జోథ్‌పూర్, కోట, అజ్మీర్, ఆల్వార్, భిల్వారా, బికనెర్, ఉదయ్‌పూర్, సికార్, పలి, నాగౌర్ జిల్లాల్లో ఈ 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకే ప్రాంతంలో ఐదుగురు మించి ఎక్కువ మంది గుమిగూడరాదు.


సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కోవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశానంతరం సెక్షన్ 144 అమలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, చీఫ్ సెక్రటరీ రాజీవ స్వరూప్, ప్రధాన కార్యదర్శి (హోం) అభయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (మెడికల్ అండ్ హెల్త్) అఖిల్ అరోరా, తదితర అధికారులు పాల్గొన్నారు.


కాగా, సామాజిక, మత కార్యక్రమాలపై ఉన్న నిషేధాన్ని కూడా అక్టోబర్ 31 వరకూ పొడిగించాలని గెహ్లాట్ సర్కార్ నిర్ణయించింది. ఆ ప్రకారం అంత్యక్రియలకు 20 మంది, వివాహ కార్యక్రమాలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు.

Updated Date - 2020-09-20T23:48:03+05:30 IST