చాణక్య నీతి: ఈ ఏడు సూత్రాలలో విద్యార్థుల విజయ రహస్యం దాగుంది!

ABN , First Publish Date - 2022-02-21T11:53:19+05:30 IST

ఆచార్య చాణక్యుడు నాటి కాలంలోని గొప్ప అధ్యాపకులలో..

చాణక్య నీతి: ఈ ఏడు సూత్రాలలో విద్యార్థుల విజయ రహస్యం దాగుంది!

ఆచార్య చాణక్యుడు నాటి కాలంలోని గొప్ప అధ్యాపకులలో ఒకరు. గుప్తుల పాలనలో చాణక్యుడు.. చంద్రగుప్తుని సలహాదారునిగా వ్యవహరించారు. ఆచార్య చాణక్యుడు చాలా దూరదృష్టి గలవాడు. గొప్ప వ్యూహకర్త. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలను ఒకచోట పొందుపరిచిన చాణక్య.. చాణక్య నీతి వంటి గొప్ప గ్రంథాన్ని రచించారు. ఒక వ్యక్తి చాణక్య నీతిలో పేర్కొన్న విషయాలను అనుసరిస్తే, అతను తన జీవితాన్ని విజయవంతంగా మలచుకోవచ్చు. విద్యార్థి జీవితం తపస్సు లాంటిదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. కుటుంబంతో పాటు చుట్టుపక్కల వాతావరణం.. విద్యార్థుల జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. చుట్టూ ఉన్న వాతావరణం సరిగా లేకున్నా.. విద్యార్థులు తమ ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తే విజయం సాధిస్తారు. అయితే అందుకు ఈ ఏడు సూత్రాలు అనుసరించాలని ఆచార్య చాణక్య తెలిపారు.


కోపంపై నియంత్రణ : చాణక్య నీతి ప్రకారం కోపాన్ని అదుపు చేసుకోలేని విద్యార్థి జ్ఞానం ఉన్నప్పటికీ అజ్ఞాని లాంటివాడు. ఎందుకంటే కోపంగా ఉన్నప్పుడు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది కాబట్టి విద్యార్థి తన కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. 

అత్యాశకు దూరం: అత్యాశ అనేది వ్యక్తిని చెడు కర్మల వైపుకు నెట్టివేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మనస్సులో చేరిన అత్యాశ అతనిని తప్పుడు దారి పట్టిస్తుంది. అందుకే విద్యార్థులలో అత్యాశ అనే భావం ఉండకూడదు. ప్రతి విద్యార్థి దీన్ని నియంత్రించడం ముఖ్యం. విద్యార్థుల మనసులో  జ్ఞాన సముపార్జనపై అత్యాశ ఉండాలి

రుచి నియంత్రణ: ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు మంచి ఆరోగ్యంతో పాటు మేథస్సు అభివృద్ధికి సహాయపడే ఆహారాన్ని తినాలి. పలు రుచులకు అలవాటు పడిన విద్యార్థులకు చదవడం, రాయడంపై ఆసక్తి తగ్గుతుంది. అందుకే విద్యార్థులు సాధారణ ఆహారం మాత్రమే తినడం ఉత్తమం.

మేకప్‌కు దూరం: ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు మేకప్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వేషధారణపై మాత్రమే మనసు పెడితే మనసు చదువుపై నిలవదు.

అపహాస్యం వద్దు: చాణక్య నీతిలో పేర్కొన్న వివరాల ప్రకారం ఇతరులను అపహాస్యం చేసే విద్యార్థులు తమ చదువులను పక్కన పెడతారు. కొన్నిసార్లు అధికమైన వినోదం కారణంగా వివాదాలు తలెత్తుతాయి. అందుకే విద్యార్థి ఈ విషయంలో పరిమితుల్లో ఉండాలి


నిద్ర నియంత్రణ: నిద్రను నియంత్రించలేని విద్యార్థి  జ్ఞానాన్ని పొందలేడు.  దేనిలోనూ విజయం సాధించలేడు. అందువల్ల నిద్రను అదుపు చేయడంతోపాటు సరైన సమయానికి నిద్ర లేవడం, సరైన సమయానికి నిద్రపోవడం అవసరం. 

కామానికి దూరం: చాణక్య నీతి ప్రకారం కామంలో మునిగిపోయే విద్యార్థి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడు. విద్యార్థులు తమ మనసులోని కామానికి సంబంధించిన ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.



Updated Date - 2022-02-21T11:53:19+05:30 IST