Advertisement
Advertisement
Abn logo
Advertisement

మైక్ టైసన్‌కు సంబంధించి ఎవరికీ తెలియని రహస్యాన్ని బయటపెట్టిన మాజీ బాడీగార్డ్


న్యూయార్క్: బాక్సింగ్ గ్రేట్ మైక్ టైసన్‌కు సంబంధించి అత్యంత రహస్యం ఒకటి బయటపడింది. రింగులోకి దిగితే ప్రత్యర్థులను ఎక్కడ చంపేస్తానోనని టైసన్ భయపడేవాడట. అందుకని ఓ ట్రిక్కు పాటించేవాడట. ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న ఆ ట్రిక్కు ఏంటనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తనలోని ఆవేశాన్ని, దూకుడును కొంత తగ్గించుకునేందుకు బౌట్‌కు ముందు శృంగారంలో పాల్గొనేవాడట. మైక్‌ టైసన్ మాజీ బాడీగార్డ్ రూడీ గోంజాలెజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 


55 ఏళ్ల టైసన్ బాక్సింగ్ రింగ్‌లో ఎంతో దూకుడుగా ఉండేవాడు. తన ఆవేశాన్ని తగ్గించుకునేందుకు రింగ్‌లో దిగడానికి ముందు శృంగారంలో పాల్గొనడం ద్వారా తన ఆవేశాన్ని తగ్గించుకునేవాడని రూడీ చెప్పుకొచ్చాడు. రింగ్‌లో అతడి చేతిలో ఎవరూ మరణించనప్పటికీ 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్‌ చెవిని కొరికి బాకింగ్స్‌ నుంచి నిషేధానికి గురయ్యాడు.


ఫైట్‌కు దిగడానికి ముందు టైసన్‌లోని శక్తిని కొంత తగ్గించడానికి తాను బాత్రూములు, చేంజింగ్‌ రూములలో అమ్మాయిలను దాచిపెట్టి ఉంచేవాడనని రూడీ చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులపై టైసన్ ఓ రైలులా మీదపడిపోయేవాడని, అందుకనే అతడి శక్తిలో కొంత తగ్గించాల్సి వచ్చేదని వివరించాడు.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement