కరోనాపై జపాన్ విజయ రహస్యం

ABN , First Publish Date - 2020-05-26T22:57:03+05:30 IST

కరోనాపై జపాన్ విజయ రహస్యంకరోనాపై జపాన్ విజయ రహస్యం ‘అప్రమత్తత’. వాస్తవానికి జపాన్‌లో జపాన్‌లో జనవరిలోనే తొలి కరోనా కేసు నమోదైంది. అయితే అది ఇక ఏమాత్రం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని జాగత్తలూ తీసుకుంది. ఇప్పటివరకూ దేశం మొత్తంమీద చోటుచేసుకున్న కరోనా మరణాలు కేవలం వెయ్యి లోపేనంటే ఆశ్చర్యం కలగక మానదు. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం జపనీయులకు అలవాటు.

కరోనాపై జపాన్ విజయ రహస్యం

క్యోటో : కరోనాపై జపాన్ విజయ రహస్యంకరోనాపై జపాన్ విజయ రహస్యం ‘అప్రమత్తత’. వాస్తవానికి జపాన్‌లో జపాన్‌లో జనవరిలోనే తొలి కరోనా కేసు నమోదైంది. అయితే అది ఇక ఏమాత్రం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని జాగత్తలూ తీసుకుంది. ఇప్పటివరకూ దేశం మొత్తంమీద చోటుచేసుకున్న కరోనా మరణాలు కేవలం వెయ్యి లోపేనంటే ఆశ్చర్యం కలగక మానదు. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం జపనీయులకు అలవాటు.


ఈ క్రమంలోనే కరోనా బారి నుంచి పెద్దగా ప్రమాదమేమీ లేకుండానే జపాన్ బయటపడ్డట్లు చెబుతున్నారు. అంతేకాదు... వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఇక ఎటువంటి వైరస్‌నైనా ఎదుర్కొనేందుకుగాను జపాన్‌లో 2018 లోనే పెద్దఎత్తున వైద్య సిబ్బందిని నియమించుకోవడబం విశేషం.


జపాన్‌లో ఇప్పటివరకు 16 వేల మందికి పైగా కరోనా బారిన పడగా.. కేవలం 851 మంది మాత్రమే మ‌త్యువాత పడ్డారు. రోజువారీ కేసులు కూడా నామమాత్రంగానే ఉంటుండడం విశేషం. మొత్తంమీద ఈ వైరస్‌ను సమర్ధంగా తిప్పికొట్టడంలో జపాన్ రికార్డ్ సృష్టించినట్లే. అంటే... ఆరోగ్య పరిరక్షణ విషయంలో జపాన్ వంటి దేశాలను చూసి స్ఫూర్తిని పొందవచ్చు. 

Updated Date - 2020-05-26T22:57:03+05:30 IST