దౌర్జన్యం చేశారని ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-25T05:48:15+05:30 IST

విధి నిర్వహణలో ఉన్న తనపై ఆర్‌బీపురం ఆగ్రహారానికి చెందిన వ్యక్తి దౌర్జన్యం చేసినట్టు లక్కవరపుకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌ మునగపాక పోతురాజు జామి ఎస్‌ఐ నసీమాబేగంకు ఫిర్యాదు చేశారు.

దౌర్జన్యం చేశారని ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌ ఫిర్యాదు

శృంగవరపుకోట రూరల్‌ (జామి) : విధి నిర్వహణలో ఉన్న తనపై ఆర్‌బీపురం ఆగ్రహారానికి చెందిన వ్యక్తి దౌర్జన్యం చేసినట్టు లక్కవరపుకోట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌ మునగపాక పోతురాజు జామి ఎస్‌ఐ నసీమాబేగంకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కానిస్టేబుల్‌ పోతురాజుకు లక్కవరపుకోట మండలం కొట్యాడ వైన్‌షాపు నుంచి అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో ఆయన ఈ రహదారిలో తనిఖీలు చేస్తుండగా... ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఆపి తన ఐడీకార్డును చూపించి సోదా చేశారు. అతని వద్ద ఏమీ లేకపోవడంతో వెళ్లిపోవాలని సూచించారు. ఈ ఘటనతో ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తాను ఈ ఊరికి ఉపసర్పంచ్‌నని, తననే అడ్డుకుంటావా అంటూ మండి పడడంతో పాటు కానిస్టేబుల్‌ మొబైల్‌ ఫోన్‌ను తీసుకుని ఇసిరికొట్టాడు. దురుసుగా ప్రవర్తిం చి బైక్‌ తాళాలు లాక్కొని, ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌తో పాటు సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తిపై ఆరా తీయగా  సదరు వ్యక్తి లింగరాజుగా గుర్తించారు. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి బైక్‌ తాళాలు అడగ్గా తన సిబ్బందితో దురుసుగా మాట్లాడారు. దీంతో కానిస్టేబుల్‌ పోతురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీఐ సింహాద్రి నాయుడు దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.

 

Updated Date - 2021-07-25T05:48:15+05:30 IST