సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌ని ఏడు దుకాణాలు సీల్‌‌!

ABN , First Publish Date - 2020-07-11T13:11:17+05:30 IST

బీహార్‌లో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ నిరంత‌రం వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ...

సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించ‌ని ఏడు దుకాణాలు సీల్‌‌!

నలంద: బీహార్‌లో పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ నిరంత‌రం వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ కొందరు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా సామాజిక దూరం పాటించ‌ని ప‌లు దుకాణాల‌ను అధికారులు సీల్‌ చేశారు. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం సామాజిక దూరం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు న‌లంద‌లోని ఒక మెడికల్ స్టోర్‌తో సహా ఏడు దుకాణాలను ఎస్‌డిఓ ఆదేశాల మేరకు అధికారులు సీల్‌ చేశారు. అదేవిధంగా మాస్కులు ధ‌రించ‌కుండా రోడ్ల మీద‌కు వ‌స్తున్న‌వారికి కూడా జ‌రిమానాలు విధిస్తున్నారు. ఈ ప్ర‌క్రియ మున్ముందు కూడా కొన‌సాగుతుంద‌ని అధికారులు తెలిపారు. మ‌రోవైపు పశ్చిమ చంపారణ్‌ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను అరిక‌ట్టేందుకు అధికారులు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రపరిచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. 

Updated Date - 2020-07-11T13:11:17+05:30 IST