Abn logo
May 17 2021 @ 22:29PM

విద్యా శాఖది సముచిత నిర్ణయం

ఏడో తరగతిలో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ పాఠ్యాంశంపై హర్షం

బాల్యంలోనే విద్యార్థుల్లో సత్ప్రవర్తనకు దోహదం

విశాఖపట్నం, మే 17: ప్రపంచమంతా విస్తరించి ఉన్న స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం గురించి బాల్యం నుంచే తెలియజేసేందుకు ఏడో తరగతి పాఠ్యాంశంగా చేర్చడం సముచిత నిర్ణయమని  భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నరవ ప్రకాశరావు హర్షం వ్యక్తం చేశారు. బాలలు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి ఎంతో ఉపయుక్తమయ్యే ఈ విభాగం గురించి చిన్నప్పుడే అవగాహన ఉండడం ఎంతో అవసరమన్నారు. దీన్ని గుర్తించి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖకు, విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్ననరు. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ మరింత అభివృద్ధి చెందడానికి ఈ పాఠం ఉపయోగపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement