Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెదడు ఆరోగ్యం కోసం...

ఆంధ్రజ్యోతి(09-03-2021)

కంటినిండా నిద్రపోతే శరీరం, మనసూ రెండూ చురుకుగా ఉంటాయని తెలుసు. అయితే ఘాడ నిద్ర వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం చెబుతోంది. సైన్స్‌ అడ్వాన్సెన్‌ జర్నల్‌లో వచ్చిన ఈ అధ్యయనం సారంశం ఏమిటంటే... 


ఫ్రూట్‌ ఫ్లైస్‌ అనే ఈగ జాతి కీటకాల మెదడు పనితీరు, వాటి ప్రవర్తన మీద జరిపిన  పరిశోధనల్లో ఘాడ నిద్ర వల్ల న్యూరోడిజెనరేటివ్‌ వ్యాధికి కారణమయ్యే హానికర ప్రొటీన్లు నశిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ‘‘మెదడు చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే హానికర ప్రొటీన్లను తొలగించడం చాలా ముఖ్యం.


ఫలితంగా కేంద్ర నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది. వ్యర్థాల తొలగింపు అనేది మెలకువ లేదా నిద్రించే సమయంలో జరగవచ్చు. అయితే ఘాడ నిద్రలో మెరుగ్గా జరుగుతుంది’’ అంటారు సీనియర్‌ పరిశోధకులు రవి అల్లాడా. ఫ్రూట్‌ ఫ్లైస్‌ల నిద్ర-మెలకువ వలయాన్ని నియంత్రించే న్యూరాన్లు మనుషుల న్యూరాన్లను పోలి ఉంటాయి. ఈ కారణం వల్లనే వీటిని పరిశోధకులు నిద్ర- మెలకువ వలయం, న్యూరోడీజెనరేటివ్‌ డిసీజెస్‌ మీద అధ్యయనం చేసేందుకు ఎంచుకుంటారు.


Advertisement
Advertisement