పాఠశాలలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-11-29T06:54:33+05:30 IST

మండల పరిధి కేదార్లంక యూపీ స్కూల్లో కరోనా కలకలం రేగింది. వారిలో ముగ్గురు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకింది. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలలో   కరోనా కలకలం

కేదార్లంక యూపీ స్కూల్లో ముగ్గురు టీచర్లకు పాజిటివ్‌

 కాంటాక్ట్‌ జాబితాలోని విద్యార్థులకు నెగిటివ్‌

 ఆత్రేయపురంలో ఐదుగురికి కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ


కపిలేశ్వరపురం, నవంబరు 28 : మండల పరిధి కేదార్లంక యూపీ స్కూల్లో కరోనా కలకలం రేగింది. వారిలో ముగ్గురు ఉపాధ్యాయులకు వైరస్‌ సోకింది. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎంఈవో తాతారావును వివరణ కోరగా ఉపాధ్యాయులకు వైరస్‌ సోకడం వాస్తవమేనని, వైరస్‌ వ్యాప్తి నివారణ జాగ్రత్త లు తీసుకుంటున్నామని తెలిపారు. వివరాల్లోకి వెళితే ప్రాఽథమికోన్నత పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలలో ఈనెల 23న 8వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పాఠశాలలోని ఉపాధ్యాయుడికి వైరస్‌ వ్యాధి లక్షణాలు బయటపడిన నేపథ్యంలో ఆయనను కలిసిన సహచర ఉపాధ్యాయులు ఈనెల 25న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చినట్టు వైరాలజీ ల్యాబ్‌ నుంచి సమాచారం అందడంతో వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలావుండగా పాఠశాలకు వచ్చిన ఐదుగురు 8వ తరగతి విద్యార్థులకు శనివారం పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాలలకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  

ఐదుగురికి కరోనా పాజిటివ్‌

ఆత్రేయపురం, నవంబరు 28: ఆత్రేయపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో 11 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ నిర్ధారించినట్టు తెలిపారు. 


Updated Date - 2020-11-29T06:54:33+05:30 IST