విద్యార్థులు రావడం లేదు..

ABN , First Publish Date - 2021-03-02T06:50:05+05:30 IST

కొవిడ్‌ నిబంధనల మేరకు తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలకు

విద్యార్థులు రావడం లేదు..
మేకలమండి పాఠశాలలో థర్మల్‌ స్ర్కీనింగ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నిబంధనల మేరకు తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యా ర్థులు తక్కువ సంఖ్యలో హాజరవుతున్నా రు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులు, 24వ తేదీ నుంచి 6,7,8 క్లాసుల విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు కొంత ఎక్కువ మంది వెళ్తున్నప్పటికీ, సర్కారు స్కూళ్లలో హాజరు శాతం కనిపించడంలేదు. జిల్లాలోని 189 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 వరకు 26,132 మంది చదువుతుండగా, సోమవారం కేవలం 1,855 (7.10 శాతం) హాజరయ్యారు. 1,769 ప్రైవేట్‌ పాఠశాలల్లో 2,07,890 మందికి 34,477 (16.58 శాతం) హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. 


Updated Date - 2021-03-02T06:50:05+05:30 IST