వలస కార్మికులపై సుప్రీం సంచలన ఆదేశాలు.. 15 రోజుల్లోగా..

ABN , First Publish Date - 2020-06-09T23:17:17+05:30 IST

వలస కార్మికులందరినీ 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు చేర్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు..

వలస కార్మికులపై సుప్రీం సంచలన ఆదేశాలు.. 15 రోజుల్లోగా..

న్యూఢిల్లీ: వలస కార్మికులందరినీ 15 రోజుల్లోగా వారి స్వస్థలాలకు చేర్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం కింద లాక్‌డౌన్ ఉల్లంఘించారంటూ వలస కూలీలపై దాఖలైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక క్రమపద్ధతిలో వలస కార్మికులందరి గుర్తింపు జాబితాను సిద్ధం చేయాలని కూడా ధర్మాసనం పేర్కొంది. కార్మికులందరికీ ఉపాధి మార్గం చూపించి, వారి నైపుణ్యాన్ని గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా ఇదే కేసులో గత విచారణ సందర్భంగా వలస కూలీలందరికీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధి మార్గం చూపించాలంటూ సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-06-09T23:17:17+05:30 IST