రైతు సంఘాలతో సమావేశమైన సుప్రీం నియమిత కమిటీ

ABN , First Publish Date - 2021-01-21T22:18:32+05:30 IST

అయితే వ్యవసాయ చట్టాలు బిల్లుల రూపంలో ఉన్నప్పుడే బహిరంగా సమర్థించిన ఈ నలుగురిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కమిటీలోని ఒక సభ్యుడు తప్పుకున్నారు.

రైతు సంఘాలతో సమావేశమైన సుప్రీం నియమిత కమిటీ

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సంక్షోభాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ గురువారం సాయంత్రం రైతు సంఘాల నేతలతో సమావేశం అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలపై ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నిర్మొహమాటంగా తెలియజేయాలని రైతులకు విజ్ణప్తి చేశారు. అనంతరం రైతు సంఘాల నేతలు తమ అభ్యంతరాలను, డిమాండ్లను సదరు కమిటీకి నివేదించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన వరుస చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేవకపోవడంతో నలుగురు సభ్యులతో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీని నియమించింది. అయితే వ్యవసాయ చట్టాలు బిల్లుల రూపంలో ఉన్నప్పుడే బహిరంగా సమర్థించిన ఈ నలుగురిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కమిటీలోని ఒక సభ్యుడు తప్పుకున్నారు.

Updated Date - 2021-01-21T22:18:32+05:30 IST