ఆధ్యాత్మిక కేంద్రంగా సత్యనారాయణస్వామి ఆలయం

ABN , First Publish Date - 2021-01-27T05:51:40+05:30 IST

ఆధ్యాత్మిక కేంద్రంగా సత్యనారాయణస్వామి ఆలయం

ఆధ్యాత్మిక కేంద్రంగా సత్యనారాయణస్వామి ఆలయం
ఆలయాన్ని ఇస్కాన్‌ ప్రతినిధులకు అప్పగిస్తున్న నర్సింహులు

  • ఇస్కాన్‌కు అప్పగింత  
  • శోభాయమానంగా ఉత్సవాలు 
  • భజనలతో మార్మోగిన శోభాయాత్ర 
  • ఇక నిత్య భజనలు-సంకీర్తలు


షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ పట్టణంలోని పరిగి రోడ్డులో వెలిసిన శ్రీరమా సమేత సత్యనారాయణస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతోంది. మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గల ఇస్కాన్‌ సంస్థ సత్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా శోభాయమానంగా కార్యక్రమాలను నిర్వహించింది. స్వామికి ప్రత్యేక పూజ, హోమం, భజనలు, శోభాయాత్ర కార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఇస్కాన్‌ భక్తులు రమా సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్రలో భజనలు చేస్తూ మార్మోమోగించారు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కట్టా నర్సింహులు 18సంవత్సరాల క్రితం తన సొంత స్థలంలో సత్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించి, నిత్యపూజలు, వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆలయ నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఇస్తాన్‌ సంస్థకు అప్పగించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ సమక్షంలో కట్టా నర్సింహులు ఇస్కాన్‌ ప్రతినిధులు భక్తప్రేమస్వామి మహరాజ్‌, ఆనందమయదాస్‌, వరదకృష్ణదాస్‌, ఇస్కాన్‌ సభ్యులు వేదాంత చైతన్య దాస్‌, రాధేశ్యామ్‌దా్‌సలకు ఆలయ తాళంచెవిని అప్పగించారు. ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వీరాజిల్లాలనే ఆలోచనతో ఇస్కాన్‌కు అప్పగించానని కట్టా నర్సింహులు తెలిపారు. ఇక ముందు ఆలయంలో నిత్యపూజలతో పాటు భజనలు, నగర సంకీర్తలను కొనసాగుతాయని భక్తులు అధికసంఖ్యలో హాజరై స్వామి సేవలో తరించాలని ఇస్కాన్‌ ప్రతినిధులు కోరారు. ఇస్కాన్‌ సభ్యుల కోరిక మేరకు ఆలయం పక్కనే ఉన్న మున్సిపాలిటీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె. నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, సరాపు జగదీశ్వర్‌, కట్ట పుల్లయ్య, కట్ట ప్రవీణ్‌, ఎల్‌. ప్రకా్‌షరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:51:40+05:30 IST