శాటిలైట్ చిత్రాల్లో 3.25 మైళ్ల పొడవైన రష్యా సైనిక కాన్వాయ్

ABN , First Publish Date - 2022-02-28T21:33:26+05:30 IST

ఒకవైపు ఉద్రిక్తతల సడలింపు విషయమై చర్చించేందుకు మాస్కో, కీవ్ అంగీకరించినప్పటికీ, ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఆయుధాలతో దాడి..

శాటిలైట్ చిత్రాల్లో 3.25 మైళ్ల పొడవైన రష్యా సైనిక కాన్వాయ్

కీవ్: ఒకవైపు ఉద్రిక్తతల సడలింపు విషయమై చర్చించేందుకు మాస్కో, కీవ్ అంగీకరించినప్పటికీ, ఉక్రెయిన్‌పై రష్యా భారీ ఆయుధాలతో దాడి జరిపేందుకు ముందుకు వెళ్తున్నట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. 3.25 మైళ్ల పొడువునా రష్యా సైనిక కాన్వాయ్ కీవ్ రూట్‌లో వెళ్తున్నట్టు ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. మాక్సర్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ యూఎస్ కంపెనీ ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.


ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో వందలాది మిలట్రీ వాహనాలతో సహా రష్యాకు చెందిన గ్రౌండ్ ఫోర్సెస్ భారీగా మోహరించడం ఈ ఛాయాచిత్రాల్లో కనిపిస్తోంది. ఉక్రెయిన్‌ నగరమైన ఇవాన్‌వీక్ వద్దనున్న  పి-02-02 రోడ్డుపై (షెవచెంకా రోడ్డు) సైనిక కాన్వాయ్ వెళ్తున్నట్టు గుర్తించారు. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ బలగాలు ఉన్నాయి. రష్యా కాన్వాయ్‌లో ఇంధనం, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాంటీ వాహనాలు యుద్ధ ట్యాంకులు ఉన్నట్టు ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. రష్యా గగనతల దాడుల్లో ఇటీవల ధ్వంసమైన హోస్టోమల్‌లోని ఆంటొనోవ్ ఎయిర్‌పోర్ట్ వద్ద పెద్దఎత్తున పొగలు ఎగసిపడుతున్నట్టు మరో శాటిలైట్ ఛాయాచిత్రం చెబుతోంది. ఆదివారం ఉదయం ఈ ఛాయాచిత్రాలను తీశారు.

Updated Date - 2022-02-28T21:33:26+05:30 IST