Kabul : విమానాశ్రయ ఉపగ్రహ చిత్రాల్లో భారీగా జనం

ABN , First Publish Date - 2021-08-17T16:37:49+05:30 IST

ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న అస్తవ్యస్త దృశ్యాలను చూసి ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది....

Kabul : విమానాశ్రయ ఉపగ్రహ చిత్రాల్లో భారీగా జనం

కాబూల్ (అఫ్ఘానిస్థాన్): ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న అస్తవ్యస్త దృశ్యాలను చూసి ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. కాబూల్ విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు జనసమ్మర్ధంగా మారాయి. అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి విమానాల్లో విదేశాలకు పారిపోయేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో కాబూల్ విమానాశ్రయం జనసంద్రంగా మారిందని ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూస్తే విదితమవుతోంది. కాబూల్ విమానాశ్రయం రన్ వేపై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. 


జనసంద్రంతో కూడిన కాబూల్ విమానాశ్రయం ఉపగ్రహ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబూల్ విమానాశ్రయానికి వెళ్లేందుకు జనం కార్లలో బారులు తీరారు. విమానాశ్రయం బయట, లోపల విమానాల చుట్టూ వేలాదిమంది ప్రజలు గుమిగూడారు. దేశంనుంచి పారిపోయేందుకు ఇద్దరు వ్యక్తులు తమను తాము తాళ్లతో విమాన చక్రాలకు కట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. విమానాశ్రయంలో ఎటూ చూసిన జనంతో గందరగోళ పరిస్థితులు కనిపించాయి.


Updated Date - 2021-08-17T16:37:49+05:30 IST