‘శశికళ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ..’

ABN , First Publish Date - 2020-10-28T15:12:03+05:30 IST

బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండియన్‌ తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష..

‘శశికళ విడుదలపై రెండు రోజుల్లో క్లారిటీ..’

చెన్నై : బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండియన్‌ తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష , రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లి 3 సంవత్సరాల 8 నెలలు పూర్తయింది.. ఇంకా మూడు నెలలు (జనవరి వరకు) ఆమె జైలులో ఉండాల్సి ఉంది. కానీ, సత్ప్రవర్తన కారణంగా ఆమె ముందుగానే విడుదలయ్యే అవకాశముందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ విషయమై ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండియన్‌ మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేది వరకు న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారన్నారు. సెలవుల తరువాత న్యాయస్థానం నుంచి కబురు వస్తుందని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించాలంటూ శశికళకు కబురు అందితే, తనకు లేఖ ద్వారా ఆ విషయం తెలియజేస్తారని, వెంటనే జరిమానాను న్యాయస్థానంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏది ఏమైనా శశికశ జైలు నుంచి విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-10-28T15:12:03+05:30 IST