సారూ.. తేనెతుట్టెలు తొలగించరూ

ABN , First Publish Date - 2022-05-27T06:42:36+05:30 IST

యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనంలో అధికారులు, సిబ్బంది తేనె తుట్టెలతో భయాందోళన చెందుతున్నారు. మొదటి అంతస్తులో ఒక చోట, రెండో అంతస్తులో రెండుచోట్ల తేనెటీగలు పెద్ద తేనె తుట్టెలను పెట్టాయి. ఏ క్షణంలో అవి తమపై దాడి చేస్తాయోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు..

సారూ.. తేనెతుట్టెలు తొలగించరూ

ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోని వైనం

యాదాద్రి, మే26, (ఆంధ్రజ్యోతి):యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌ భవనంలో అధికారులు, సిబ్బంది తేనె తుట్టెలతో భయాందోళన చెందుతున్నారు. మొదటి అంతస్తులో ఒక చోట, రెండో అంతస్తులో రెండుచోట్ల తేనెటీగలు పెద్ద తేనె తుట్టెలను పెట్టాయి. ఏ క్షణంలో అవి తమపై దాడి చేస్తాయోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.. వీటిని తొలగించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో కొన్ని నెలలుగా సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే తొలగించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-27T06:42:36+05:30 IST