‘2 నుంచి నామినేషన్ల స్వీకరణ’

ABN , First Publish Date - 2021-01-27T06:25:59+05:30 IST

బనగానపల్లె మండలంలో ఫిబ్రవరి 2 నుంచి సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో నాగప్రసాద్‌ మంగళవారం తెలిపారు.

‘2 నుంచి నామినేషన్ల స్వీకరణ’

బనగానపల్లె, జనవరి 26: బనగానపల్లె మండలంలో ఫిబ్రవరి 2 నుంచి సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో నాగప్రసాద్‌ మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల స్వీకరణకు తుది గడువన్నారు. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన, 6న నామినేషన్ల అభ్యంతరాలపై పరిఽశీలన, 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిపారు. పిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువన్నారు. 13న ఉదయం 6.30 గంటలనుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.

 

సర్పంచ్‌ పదవికి నామినేషన్లు వేసే కేంద్రాలు ఇవే: అభ్యర్థుల నుంచి నావినేషన్లు స్వీకరించే కేంద్రాలను ఎంపీడీవో నాగప్రసాద్‌ మంగళవారం తెలిపారు. బనగానపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలకు బనగానపల్లె గ్రామ పంచాయితీ కార్యాలయంలో, యాగంటిపల్లె, యనకండ్ల, మీరాపురం, ఎర్రగుడి గ్రామ పంచాయితీలకు  యాగంటిపల్లెలో, అప్పలాపురం, టంగుటూరు, కైప గ్రామాలకు అప్పలాపురం గ్రామంలో, పాతపాడు, పసుపుల, క్రిష్ణగిరి, గులాం అలియాబాద్‌ తండా గ్రామ పంచాయితీలకు పాతపాడులో, ఇల్లూరు కొత్తపేట, తమ్మడపల్లె, మిట్టపల్లె గ్రామాలకు ఇల్లూరు కొత్తపేటలో, నందవరం, వెంకటాపురం గ్రామాలకు నందవరంలో, నందివర్గం, తిమ్మాపురం, రామతీర్థం గ్రామాలకు నందివర్గంలో, పలుకూరు గ్రామ సర్పంచ్‌కు పలుకూరు పంచాయతీ కార్యాలయంలో, బీరవోలు, చెర్వుపల్లె, రామకృష్ణాపురం గ్రామాల సర్పంచ్‌లకు పలుకూరు ఎలిమెంటరీ పాఠశాలలోను నామినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఇవే: ఓసీ మహిళలకు 6 స్థానాలు, ఓసీల కు 6 బీసీ జనరల్‌కు 3, బీసీ మహిళలకు 3, ఎస్టీ మహిళలకు2, ఎస్సీ మహిళలకు2, ఎస్సీ జనరల్‌కు 2 కేటాయించినట్లు ఎంపిడీవో తెలిపారు.

Updated Date - 2021-01-27T06:25:59+05:30 IST