రూ.20కే లీటర్ పెట్రోల్, కేవలం వంద రూపాయలకే గ్యాస్ సిలిండర్.. వైరల్ అవుతున్న IPS అధికారి పోస్ట్!
ABN , First Publish Date - 2022-10-11T01:48:34+05:30 IST
పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎస్ ఆఫీసర్ చేసిన ఆ పోస్టు చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకా
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్రజల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎస్ ఆఫీసర్ చేసిన ఆ పోస్టు చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
‘లీటర్ పెట్రోల్ కేవలం రూ.20కే లభించేలా చేస్తా. రూ.100కే గ్యాస్ సిలిండర్ ఇస్తా. అంతేకాదు జీఎస్టీ ఎత్తివేస్తా. ప్రతి ఇంటికి మందు బాటిల్. ఫ్రీ వైఫైతో పాటు ప్రతి ఇంటికీ బైక్ ఇస్తా’ ఇవీ ఎలక్షన్స్‌లో పోటీ చేసే ఓ అభ్యర్థి ఓటర్లకు ఇచ్చిన హామీలు. ఈ హామీలు చూసి ప్రధాని పదవికి పోటీ చేసే అభ్యర్థి ఇచ్చిన వాగ్దానాలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఈ ఆచరణ సాధ్యంకాని హామీలను ఓ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి ఇచ్చారు. షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. అవును హర్యానాలోని సిర్సద్ గ్రామానికి చెందిన జైకరణ్ లత్వాల్(Sarpanch candidate).. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆ ఊరి ప్రజలకు ఈ హామీలు ఇస్తూ పోస్టర్లు విడుదల చేశాడు. ఆ పోస్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పోస్టర్‌కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఆ గ్రామానికి షిఫ్ట్ అవుతున్నా’ అని ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో అదికాస్తా వైరల్(viral)గా మారింది. దీంతో నెటిజన్లు(social media) రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ‘గ్రామం చుట్టూ మూడు ఎయిర్ పోర్టులు నిర్మిస్తా. బస్సుల స్థానంలో హెలికాప్టర్లను ఏర్పాటు చేసి, ఐదు నిమిషాలకు ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తా. ఢిల్లీ వరకు నేరుగా మెట్రో రైలు ఏర్పాటు చేస్తా. అంతేకాదు మహిళలకు ఫ్రీగా మేకప్ కిట్లు అందజేస్తా’ వంటి హామీలు కూడా జైకరణ్ లత్వాల్ వేయించిన పోస్టర్లో ఉన్నాయి.