Abn logo
Jul 9 2020 @ 05:13AM

బాలామృతం పంపిణీ

బెజ్జూరు, జూలై8: బెజ్జూరు మండల కేంద్రంలోని ఒకటవ అంగన్‌వాడీ కేంద్రంలో బుదవారం స్థానిక సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌ బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తుందని, దీంతో వారు అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరు అంగన్‌వాడీ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త వసుమతి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement