సర్దార్‌ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2020-11-01T09:55:44+05:30 IST

దేశ మొదటి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు...

సర్దార్‌ జీవితం స్ఫూర్తిదాయకం

  • పటేల్‌కు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని నివాళి 


న్యూఢిల్లీ/కేవడియా, అక్టోబరు 31: దేశ మొదటి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పటేల్‌ జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పటేల్‌ జాతీయ సమైక్యతకు మారుపేరని, ప్రతి భారతీయుడి హృదయంలో ఆయన ఉన్నారని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. గుజరాత్‌లోని కేవడియాలో 182 అడుగుల పటేల్‌ విగ్రహం పాదాల వద్ద మోదీ పూలు జల్లి నివాళులర్పించారు. కాగా, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని   మోదీ ట్విటర్‌లో నివాళులర్పించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రా గాంధీ ఇందిరకు అంజలి ఘటించారు. ఇందిర స్మారకం శక్తిస్థల్‌ వద్ద సోనియా, ప్రియాంక నివాళి అర్పించగా.. రాహుల్‌ ట్విటర్‌లో నివాళి అర్పించారు.


Updated Date - 2020-11-01T09:55:44+05:30 IST