కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ రాజీనామా

ABN , First Publish Date - 2021-07-07T19:26:17+05:30 IST

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం తన

కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ రాజీనామా

న్యూఢిల్లీ : కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా)లో ఆయన పని చేశారు. ఆయన బుధవారం ఉదయం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు ధ్రువీకరించారు. తాను తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు లభించబోయే కొత్త పాత్ర గురించి తనకు తెలియదని చెప్పారు. 


ఇదిలావుండగా, కేంద్ర మంత్రివర్గంలోకి చేరబోతున్నవారిలో 13 మంది న్యాయవాదులు, 6గురు వైద్యులు, 5 గురు ఇంజనీర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న జీ కిషన్ రెడ్డికి పదోన్నతి లభించబోతున్నట్లు సమాచారం. 23 మంది అనుభవజ్ఞులైన పార్లమెంట్ సభ్యులకు మంత్రి మండలిలో అవకాశం దక్కబోతున్నట్లు సమాచారం. 


కొత్తగా 43 మంది మంత్రులు మోదీ మంత్రివర్గంలో చేరబోతున్నారు. వీరంతా బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. 


Updated Date - 2021-07-07T19:26:17+05:30 IST