కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్ష పదవికి సంకు రాజీనామా

ABN , First Publish Date - 2021-10-28T06:14:52+05:30 IST

గ్రేటర్‌ విశాఖ నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి సంకు వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్ష పదవికి సంకు రాజీనామా

విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖ నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి సంకు వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్‌కు పంపించినట్టు ఆయన బుధవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. పార్టీ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధిష్ఠానం నుంచి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే ఖాళీ అయిన నగర పార్టీ అధ్యక్ష పదవికి చోడదాసి సుధాకర్‌ సహా మరో ఇద్దరు పోటీపడుతున్నారు. 

Updated Date - 2021-10-28T06:14:52+05:30 IST