సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2022-01-15T06:07:39+05:30 IST

సంక్రాంతి సందడి

సంక్రాంతి సందడి
భవానీద్వీపంలో జరిగిన వేడుకల్లో రైతు వేషధారణలో చిన్నారి

విజయవాడ, ఆంధ్రజ్యోతి : తొలి కోడిని తానే మేల్కొలిపి.. గడగడ వణికించే చలిని పక్కకు నెట్టి.. హరిదాసుల హరినామ సంకీర్తనలతో... డూడూ బసవన్నల సన్నాయి మేళాలతో.. పట్టు పరికిణీల పడుతుల వయ్యారి రంగవల్లుల నడుమ సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే శుభగడియలకు జిల్లా ముస్తాబైంది. పిండివంటల ఘుమఘుమలు.. చెరుకు గడల తియ్యదనాలు.. పాలపొంగళ్ల నిండుదనాలు.. కోడిపందేల సందళ్లు.. కొత్త అల్లుళ్ల డాబూ దర్పాలు.. కొంటె మరదళ్ల అల్లరి చేష్టలతో సంక్రాంతి సరికొత్తగా మన ముందుకొచ్చింది. 





Updated Date - 2022-01-15T06:07:39+05:30 IST