Abn logo
May 29 2020 @ 04:46AM

రాష్ర్టాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం

మంత్రి శంకరనారాయణ


అనంతపురం, మే 28(ఆంధ్రజ్యోతి): ప్రోత్సాహకాలు అందించటం ద్వారా రాష్ర్టాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ప రిశ్రమలు, మౌలిక సదుపాయాలపై మేధోమథన సదస్సు నిర్వహించారు. ముందుగా పలువురు పారిశ్రామిక వేత్తలు, లబ్ధిదారులు, నిపుణుల సూ చనలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల్లో పెట్టుబడులు పెంచే దిశగా ప్రభుత్వం రాయితీలు కల్పించిందన్నా రు. జిల్లాలోని ఎంఎ్‌సఎంఈలకు రూ.82 కోట్ల బకాయిలు విడుదల చే సిందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే లు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, తిప్పేస్వామి, శ్రీధర్‌రెడ్డి, రైతు భరోసా, రెవెన్యూ విభాగ జేసీ నిశాంత్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ వీరాంజనేయులు, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement