సీవీసీగా సంజయ్‌ కొఠారి

ABN , First Publish Date - 2020-02-20T09:01:46+05:30 IST

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ కొత్త చీఫ్‌(సీవీసీ)గా రాష్ట్రపతి మాజీ కార్యదర్శి సంజయ్‌ కొఠారి ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. మెజారిటీ అభిప్రాయం మేరకు

సీవీసీగా సంజయ్‌ కొఠారి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ కొత్త చీఫ్‌(సీవీసీ)గా రాష్ట్రపతి మాజీ కార్యదర్శి సంజయ్‌ కొఠారి ఎంపికయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. మెజారిటీ అభిప్రాయం మేరకు బుధవారం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)కు కూడా కొత్త చీఫ్‌ను ఎంపిక చేసింది. సమాచార, ప్రసార శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్న బిమల్‌ జుల్కాకు సీఐసీ బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ పటేల్‌, సమాచార కమిషనర్‌గా అనితా పాండోవ్‌ను ఎంపిక చేశారు. మొత్తంగా సీవీసీ, సీఐసీల నియామకాన్నే కాంగ్రెస్‌ తప్పుబట్టింది.

Updated Date - 2020-02-20T09:01:46+05:30 IST