సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌!

ABN , First Publish Date - 2020-08-12T07:31:51+05:30 IST

షాక్‌.. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌కు ఊపిరితత్తుల క్యాన్సర్‌ 3వ దశలో ఉన్నట్లు తెలిసింది. శ్వాస సంబంధిత ఇబ్బందితో సంజయ్‌ ఆదివారం ఇక్కడి లీలావతి ఆస్పత్రికి వెళ్లారు...

సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌!

  • 3వ దశ.. చికిత్సకు అమెరికా

ముంబై, ఆగస్టు 11: షాక్‌.. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌కు ఊపిరితత్తుల క్యాన్సర్‌ 3వ దశలో ఉన్నట్లు తెలిసింది. శ్వాస సంబంధిత ఇబ్బందితో సంజయ్‌ ఆదివారం ఇక్కడి లీలావతి ఆస్పత్రికి వెళ్లారు. ఒక రోజు తర్వాత ఇంటికి వచ్చేశారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిందని మాత్రమే బయటకు తెలిపారు. కానీ, మంగళవారం ఆయన మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యిందని సమాచారం. చికిత్స కోసం కాస్త విరామం తీసుకుంటున్నానని సంజయ్‌ ట్వీట్‌ చేశారు. అనవసరంగా ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. అందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పారు. లేనిపోనివి ప్రచారం చేయవద్దని సూచించారు. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది.


Updated Date - 2020-08-12T07:31:51+05:30 IST