గంటలో పెళ్లి.. వరుడు పరార్.. చివరికి సినిమా రేంజ్‌లో క్లైమాక్స్

ABN , First Publish Date - 2021-12-20T20:24:55+05:30 IST

పెళ్లికి అంతా రెడీ.. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా ఏర్పాట్లు చేశారు.

గంటలో పెళ్లి.. వరుడు పరార్.. చివరికి సినిమా రేంజ్‌లో క్లైమాక్స్

సంగారెడ్డి: పెళ్లికి అంతా రెడీ.. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా ఏర్పాట్లు చేశారు. మరో గంటలో తాళి కట్టే సమయానికి వరుడు మాయమయ్యాడు. పచ్చని పందిట్లో పెళ్లి కుమార్తె కుటుంబం ఒక్కసారిగా షాకైంది. డబ్బు, నగలతో పెళ్లికొడుకు పారిపోయాడని, తనకు న్యాయం చేయాలంటూ పెళ్లి కూతురు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కానీ మరుసటి రోజే పరారైన వరుడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు.


సంగారెడ్డి జిల్లాలో సినిమా ట్విస్టులను తలపించే తీరులో ఓ జంట వివాహం జరిగింది. పెళ్లికి గంట ముందు చెప్పాపెట్టకుండా పారిపోయిన వరుడు ఎట్టకేలకు తిరిగొచ్చాడు. వెంటనే అమ్మాయి మెడలో మూడుముళ్లువేసి తాళికట్టాడు. సినిమా సన్నివేశాలను మించిన ఉత్కంఠతో సాగిన పెళ్లి తంతుకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి... 

Updated Date - 2021-12-20T20:24:55+05:30 IST