సందడిగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T06:44:22+05:30 IST

సందడిగా కృష్ణాష్టమి వేడుకలు

సందడిగా కృష్ణాష్టమి వేడుకలు

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 19 : జిల్లా కేంద్రమైన మచిలీపట్నం చల్లరస్తా సెంటర్‌లోని వేణుగోపాల స్వామి, దత్తాశ్రమం, జగన్నాథపురంలోని బొబ్బిలి వేణుగోపాలస్వామి, సర్కిల్‌పేట సంతాన వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, బచ్చుపేట వేంకటేశ్వరస్వామి, గొడుగుపేట వేంకటేశ్వర స్వామి, కోనేరుసెంటర్‌లోని కన్యకా పరమేశ్వరి, గీతా మందిరాల్లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఆలయ చైర్మన్‌ మామిడి మురళీకృష్ణ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌, ఆలయ కార్యదర్శి మోటమర్రి బాబా ప్రసాద్‌ పర్యవేక్షించారు.  గోపీకలు, కృష్ణుల వేషాలు అందరినీ అలరించాయి. ఆలయాల్లో ఉట్టి కొట్టె కార్యక్రమాలు నిర్వహిం చారు.  పల్లపాటి వెంకట్రావు, గొరిపర్తి రాము, ఆరెపు లక్ష్మణకుమార్‌, బొర్రా శ్రీనివాసరావు, గొరిపర్తి బసవేశ్వరరావు, గొరిపర్తి విశ్వనాథబాబు, గొరిపర్తి నిహారిక, గొరిపర్తి హరికృష్ణప్రసాద్‌,  తదితరులు పాల్గొన్నారు. వాసుదేవ గో సంఘం నిర్వాహకులు పల్లపాటి వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శక్తిగుడి సెంటర్‌లో కృష్ణష్టామి వేడుకలు జరిగాయి. గోపూజలు నిర్వహించారు.  మహిళా కళాకారులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర  మాట్లాడుతూ కృష్ణుడు బోధించిన భగవద్గీతను విస్తృత వ్యాప్తికి చేయవలసిన అవసరం ఉందన్నారు. కొనకళ్ళ బుల్లయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్‌, పల్లపాటి అభినవ్‌, వాలిశెట్టి తిరుమలరావు, గోకుల శివ, పిప్పళ్ళ కాంతారావు, బత్తిన దాసు, గనిపిశెట్టి గోపాల్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా మచిలీపట్నంలోని ఎమ్మెల్సీ, టీడీపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ బచ్చుల అర్జునుడు తన నివాసంలో శ్రీకృష్ణుడి  విగ్రహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పి.వి. ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అవనిగడ్డ టౌన్‌ : లక్ష్మీనారాయణస్వామి, గీతామందిరంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామికి, భువనేశ్వరీ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. 

ఽ నాగాయలంక : కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం మండలంలో పలు శ్రీ కృష్ణ మందిరాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక భజన మండలిచే కృష్ణ కీర్తనలు ఆలపించారు.  మోదుమూడిలోని రామాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

  ఘంటసాల : మండలంలోని శ్రీకృష్ణ మందిరాల్లో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణుడిని ప్రత్యేక అలంకించారు. భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.

  అవనిగడ్డ రూరల్‌  : మండల పరిధిలోని మోదుమూడిలో కృష్ణుడు, రాధికల వేషధారణలో చిన్నారులు అలరించారు.  

మోపిదేవి :  రావివారిపాలెంలోని సనాతన చైతన్య కుటీరం, కె.కొత్తపాలెంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం, పెదకళ్లేపల్లి శ్రీ మదన గోపాలస్వామివారి ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. మోపిదేవిలోని శ్రీ కృష్ణయాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని గ్రామపురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.

 కూచిపూడి : మొవ్వ మండలం కూచిపూడిలోని రుక్మిణి, సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో విశేషపూజలు, ఉట్టికొట్టడం, గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. సిద్ధేంద్ర కళాపీఠంలో నాట్యాచార్యులు, విద్యార్థులు  వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపిక, కృష్ణుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. కారకంపాడు, మొవ్వ, పెడసనగల్లు, నిడుమోలు తదిరత గ్రామాల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

  పామర్రు : మండలంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మర్రివాడ (పమిడిముక్కల):  ఎంపీ బాలశౌరి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం మర్రివాడలో జరిగిన వేడుకల్లో  ఎంపీ బాలశౌరి, పెనమలూరు, పామర్రు ఎమ్మెల్యేలు కె. పార్థసారఽథి, కైలే అనిల్‌కుమార్‌ ప్రత్యేక పూజలు చేశారు.  

ఐనపూరు (పమిడిముక్కల): ఐనపూరులో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. 

గుడ్లవల్లేరు  : మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంగలూరులో శ్రీకృష్ణుడి ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. కూరాడ లాక్‌డౌన్‌ బాలాజీ నగర్‌లో యువకులు, చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ఉట్టికొట్టారు.

పెదపారుపూడి  : వెంట్రప్రగడ, పెదపారుపూడి, చిన్నపారుపూడి, భూషణగుళ్ల తదితర గ్రామాల్లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెంట్రప్రగడలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెదపారుపూడిలోని శ్రీకృష్ణుని దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. 

 నందివాడ  : కృష్ణాష్టమి వేడుకలు మండలంలోని పోలుకొండ, తమిరి, కుదరవల్లి, నందివాడ పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ కృష్ణుడికి పూజలు చేసి సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలతో వీధుల్లో తిరుగుతూ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2022-08-20T06:44:22+05:30 IST