అటవీశాఖ జిల్లా అధికారిగా సందీప్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-29T05:41:35+05:30 IST

అటవీశాఖ జిల్లా అధికారిగా పీవీ సందీప్‌రెడ్డి బుధ వారం నగరంలోని వైఎస్‌ఆర్‌ టెరిటోరి యల్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ ఆర్‌ టెరిటోరియల్‌ డివిజన్‌ మొత్తం అటవీ విస్తీర్ణం 2,98,07,827 హెక్టార్లుగా ఉందన్నారు. ఏపీలోనే అటవీ విస్తీర్ణం రీత్యా ఇది అతి పెద్దదన్నారు.

అటవీశాఖ జిల్లా అధికారిగా సందీప్‌రెడ్డి
అటవీశాఖ జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పీవీ సందీప్‌రెడ్డి

కడప(క్రైం), సెప్టెంబరు 28: అటవీశాఖ జిల్లా అధికారిగా పీవీ సందీప్‌రెడ్డి బుధ వారం  నగరంలోని వైఎస్‌ఆర్‌ టెరిటోరి యల్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ ఆర్‌ టెరిటోరియల్‌ డివిజన్‌  మొత్తం అటవీ విస్తీర్ణం 2,98,07,827 హెక్టార్లుగా ఉందన్నారు. ఏపీలోనే అటవీ విస్తీర్ణం రీత్యా ఇది అతి పెద్దదన్నారు. గతంలో ప్రొద్దుటూరు డివిజన్‌లో ప్రొద్దుటూరు, వనిపెంట, ముద్దనూరు, పోరుమామిళ్ల, బద్వేలు రేంజ్‌లు ఉండేవని ఇవన్నీ వై ఎస్సార్‌ టెరిటోరియల్‌ డివిజన్‌లో కలిసి పోయా యన్నారు. కొత్త వైఎస్‌ఆర్‌ టెరిటోరియల్‌ డివిజన్‌లో మొత్తం తొమ్మిది రేంజ్‌లు ఉన్నాయన్నారు. ఇందులో 2 సబ్‌ డివిజన్‌ పరిధులుగా నిర్ణయించారన్నారు.

కలివికోడి పరిరక్షణ కోసం..

ప్రపంచంలోనే అతి అరుదైన కలివికోడి పరిరక్షణ కోసం ఐదు సంవత్సరాల ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వనవిహారి స్కీంను ఒంటిమిట్ట రేంజ్‌లో ఈ సంవత్సరం నుంచి అమలులోకి తీసుకువస్తామన్నారు. కడప ప్రజలకు ప్రకృతితో కూడిన ఆహ్లాదాన్ని పంచడానికి నగరవనాన్ని అభివృద్ధి చేస్తా మన్నారు. బేస్‌ క్యాంపు, స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, చెక్‌పోస్టుల ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రాజీవ్‌ గాంధి నేషనల్‌ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. వేంపల్లె రేంజ్‌ పరిధిలోని ఇడుపుల పాయలో నెమళ్ల ఉత్పత్తి పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-09-29T05:41:35+05:30 IST