Abn logo
Apr 17 2021 @ 00:30AM

పచ్చిశనగ విత్తనాల పరిశీలన

చేజర్ల, ఏప్రిల్‌ 16: చిత్తలూరు, నాగులవెల్లటూరు గ్రామంలో విత్తన పథకం కింద రైతులు పండించిన పచ్చిశనగ విత్తనాలను శుక్రవారం ఏపీ సీడ్స్‌ డీఎం శారద పరిశీలించారు. ఈ విత్తనాలను ఏపీ సీడ్స్‌ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో విత్తనాలకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను రైతులకు తెలియజేశారు. త్వరలో ఈ విత్తనాలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శశిధర్‌, ఏఈవో వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement