టీబీ స్టోరేజీతో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

శాంసంగ్‌ - గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను త్వరలో

టీబీ స్టోరేజీతో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌

శాంసంగ్‌ - గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ జనవరిలోనే గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ నివేదిక ప్రకారం ఈ ఫోన్లలో ఒక టీబీ స్టోరేజీ వేరియంట్‌ ఉండనుంది. వాస్తవానికి ఈ వేరియంట్‌ను రెండేళ్ళ క్రితమే విడుదల చేసింది. 12 జీబీ ర్యామ్‌, ఒక టీబీ స్టోరేజీ సదుపాయంతో ఎస్‌ టెన్‌ ప్లస్‌ను తెచ్చింది. ఈ ఫోన్లలోని ప్రైమరీ కెమెరాతో 8కె వీడియోలు, ఫ్రంట్‌ కెమెరాతో 4కె వీడియోలు తీయవచ్చు. క్వాల్కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జన్‌ 1 చిప్‌సెట్‌ ఉంటుంది. ఫ్రంట్‌ వైపు మూడు కెమెరాలు ఉంటాయని సమాచారం. 50 ఎంపి ప్రైమరీ లెన్స్‌, 10 ఎంపి టెలిఫొటో లెన్స్‌కు తోడు 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌, 12 ఎంపి అలా్ట్రవైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంటాయి. 10 ఎంపి కెమెరా సెల్ఫీలకు ఉపయోగపడుతుంది. హ్యాండ్‌సెట్‌కు 35 వాట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ కూడా ఉంటుంది. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST